YouTube channel subscription banner header

జగన్ గెలుపును అడ్డుకోవడానికి ఎల్లో మీడియా కుతంత్రాలు

Published on

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి అధికారం చేపట్టేందుకు జగన్ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోంది. ప్రజలకు వివిధ రకాల పథకాల ద్వారా.. చేరువ అవుతోంది. జగన్ రెడ్డి నిర్వహిస్తున్న సిద్ధం బహిరంగ సభలు కూడా గ్రాండ్ సక్సెస్ అవుతున్నాయి. మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలు అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. దీంతో.. చంద్రబాబుతో పాటు.. ఎల్లో మీడియాలోనూ భయం మొదలైంది. ఎక్కడ మళ్లీ జగన్ గెలుస్తాడా అని.. కుతంత్రాలు చేయడం మొదలుపెట్టాయి.

దీనిలో భాగంగానే తాజాగా ‘విశాఖ ఉక్కుకు…జగన్ తుప్పు’ అంటు బ్యానర్ హెడ్డింగ్‌తో తప్పుడు కథనాలు రాయడం మొదలుపెట్టింది. రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకురాలేకపోయిన జగన్ ప్రభుత్వం మరో వైపు విశాఖ ఉక్కును కాపాడుకోలేకపోయిందని, ఉక్కు ఫ్యాక్టరీని తుక్కుగా మార్చేందుకు జగన్ ప్రభుత్వం పూనుకుందని,ప్రైవేటీకరణను అడ్డుకోలేకపోతోందట, పరిశ్రమకు కేంద్రం ఊపితీసేస్తున్నా జగన్ వ్యతిరేకించారని ఇలా చాలానే రాసింది. ఆర్థిక సాయం చేసే అవకాశమున్నా పట్టించుకోవడం లేదని… గనుల లీజును తెలంగాణ పొడిగించినా..రాష్ట్ర పరిధిలోని గనుల లీజును మాత్రం జగన్ ప్రభుత్వం పొడిగించలేదని రాయాలన్సిన తప్పుడు రాతలన్నీ రాసేసింది.

కానీ అసలు వాస్తవాలు వేరేలా ఉన్నాయి. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని డిసైడ్ అయ్యింది 2018లోనే. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబునాయుడే. ఆ విషయం మాత్రం ఎల్లో మీడియా బయటకు చెప్పదు. అంతెందుకు.. విశాఖ ఉక్కు కేంద్రప్రభుత్వ పరిశ్రమ. దీనిపైన రాష్ట్రప్రభుత్వానికి ఎలాంటి హక్కులు, అధికారాలుండవు. తన పరిశ్రమను కేంద్రం అమ్ముకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలా అడ్డుకుంటుంది..? ఒకవేళ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకించాలని అనుకుంటే దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించమని జగన్ ప్రభుత్వం కేంద్రానికి రెండు సార్లు లేఖలు రాసింది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకుండానే లాభాల్లోకి ఎలా తీసుకురావచ్చో ఆ లేఖల్లో జగన్ ప్రభుత్వం వివరించింది.

ప్రైవేటీకరణ అంశాన్ని వ్యతిరేకిస్తు పార్లమెంటులో వైసీపీ ఎంపీలు గట్టిగా మాట్లాడారు కూడా .. ప్రధానిని కలిసినపుడు కూడా జగన్ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించద్దనే చెప్పారు. ఫ్యాక్టరీకి గతంలో కేటాయించిన గనుల నుండి వస్తున్న రా మెటీరియల్ నాసిరకంగా ఉంది కాబట్టి పొరుగునే ఉన్న ఒడిస్సాలోని గనులను కేటాయించాలని జగన్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిన విషయం ఎల్లో మీడియాకు తెలీదా?

దేశంలో ఏ ఉక్కు ఫ్యాక్టరీకైనా గనులను కేటాయించాల్సింది కేంద్ర ప్రభుత్వమే అన్న విషయం ఎల్లో మీడియాకు తెలియదు కాబోలు. తెలిసినా.. తప్పు అంతా జగన్ పై తోసేసి.. తాము చేయాల్సిన కుట్ర మొత్తం చేసేస్తోంది. కావాలనే విశాఖలో ప్రజలను రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో ఎల్లమీడియా ఇలాంటి తప్పుడు కథనాలు రాస్తోందనే విషయం స్పష్టంగా అర్థమ‌వుతోంది.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...