YouTube channel subscription banner header

సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటారా..? వైసీపీ సూటి ప్రశ్న

Published on

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై టీడీపీ సస్పెన్షన్ వేటు వేసి సరిపెట్టడాన్ని వైసీపీ తీవ్రంగా తప్పుబట్టింది. కేవలం పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఊరుకుంటారా..? అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. ఆయనపై లైంగిక దాడి కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. తనని హత్య చేయబోయాడని బాధితురాలు చెబుతున్నారని, ఎమ్మెల్యేపై హత్యాయత్నం కేసు కూడా నమోదు చేయాలని అన్నారు. అసలు సీఎం, డిప్యూటీసీఎం, హోం మంత్రి ఏం చేస్తున్నారని వైసీపీ నేతలు నిలదీశారు. ఆదిమూలంపై వెంటనే కేసులు నమోదు చేయాలన్నారు.

కోనేటి ఆదిమూలంపై ఆరోపణలు చేయడానికి బాధిత మహిళ పక్క రాష్ట్రం వెళ్లి ప్రెస్ మీట్ పెట్టిందని అంటున్నారు వైసీపీ నేతలు. ఏపీలో మహిళలకు రక్షణ కరువైందనడానికి ఇదే పెద్ద నిదర్శనం అంటున్నారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చర్యలతో సభ్యసమాజం సిగ్గుతో తలదించుకుందని కూడా విమర్శించారు. అయితే వైసీపీ ప్రశ్నలకు టీడీపీ ఘాటుగా కౌంటర్లిస్తోంది. ఆదిమూలం తప్పు చేశాడనే ఆరోపణలు వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు సస్పెన్షన్ వేటు వేశారని.. హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు జైలుకెళ్లొచ్చినా కూడా జగన్ ఆయన్ని పక్కనే ఉంచుకున్నారని ఎద్దేవా చేశారు. అనంతబాబు, దువ్వాడ, అంతకు ముందు వీడియోకాల్ తో దొరికిపోయిన గోరంట్లమాధవ్ ని, అంబటి, అవంతి.. ఇలా వైసీపీ లిస్ట్ చాలానే ఉందని.. వారిపై పార్టీ పరంగా ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు.

బాధితులు పక్క రాష్ట్రంలో ప్రెస్ మీట్ పెట్టడంపై కూడా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని, ఆమధ్య మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన హైదరాబాద్ లోనే ప్రెస్ మీట్ పెట్టారని గుర్తు చేస్తున్నారు టీడీపీ నేతలు. వారానికోసారి జగన్ బెంగళూరు వెళ్లడానికి కారణం ఏంటో.. వైసీపీ నేతలెవరైనా చెప్పగలరా అని ప్రశ్నిస్తున్నారు. ఆదిమూలం వ్యవహారంలో టీడీపీని ఇరుకునపెట్టేందుకు వైసీపీకి ఓ మంచి ఛాన్స్ దొరికింది. అయితే అంతలోనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేసి విమర్శలను కాచుకోడానికి టీడీపీ రెడీ అయింది. దీంతో మరోసారి టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...