రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ. కడప జిల్లా ఇడుపులపాయలో 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాల అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 2019 తరహాలోనే ఈ సారి కూడా సీనియర్ నేత ధర్మాన ప్రసాద రావు, నందిగాం సురేష్‌లతో అభ్యర్థుల ప్రకటన చేయించారు జగన్. వైసీపీ తన జాబితాలో బడుగు, బలహీన వర్గాలకే పెద్దపీట వేసిందన్నారు మంత్రి ధర్మాన.
ఈ జాబితాలో మొత్తం 50 శాతం స్థానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించింది వైసీపీ. ఎస్సీలకు 29, ఎస్టీలకు- 7, మైనార్టీలకు 7, బీసీలకు 48, ఓసీలకు 84 స్థానాలు కేటాయించారు. ఇక 25 ఎంపీల్లో ఎస్సీ – 4, ఎస్టీ 1, బీసీలకు అత్యధికంగా 11, ఓసీలకు – 9 స్థానాలు కేటాయించారు. ఇక జనసేనానికి పోటీగా పిఠాపురంలో వంగా గీత పోటీ చేయనుండగా.. నారా లోకేశ్‌పై మురుగుడు లావణ్య బరిలో ఉండనున్నారు. ఇక బాలకృష్ణపై పోటీగా టీఎన్ దీపిక పోటీ చేయనున్నారు.