ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటి నుంచి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు, ఆయన బ్యాచ్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. వలంటీర్లను నేరగాళ్లుగా, రేపిస్టులుగా, మనుషులను అక్రమ రవాణా చేసేవారిగా, డేటా చోరీ చేసేవాళ్లుగా చిత్రీకరిస్తూ నిరాధారమైన ఆరోపణలు చేశారు. లబ్ధిదారులకు ఇంటి వద్దనే సంక్షేమ ఫలాలను అందించడం ఇష్టం లేక, దానివల్ల జగన్కు ఎన్నికల్లో మేలు జరుగుతుందనే కక్షతో కుట్రలకు తెర తీసి వలంటీర్లపై ఆరోపణలు చేస్తూ వచ్చారు. చివరకు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు.